Gorantla Madhav Video Call: గోరంట్ల మాధవ్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వాన్ని కోరిన వాసిరెడ్డి పద్మ

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. సత్వర విచారణ చేయాలని డీజీపీకి పద్మ లేఖ రాశారు.

Gorantla Madhav Video Call: గోరంట్ల మాధవ్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వాన్ని కోరిన వాసిరెడ్డి పద్మ

Gorantla Madhav Video Call: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ (Gorantla Madhav Video Call) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్ మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడినట్లు కనిపిస్తుంది. ఇది గురువారం ఉదయం నుంచి ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసింది. వైసీపీ నుంచి ఎంపీ మాధవ్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మాధవ్ వీడియో ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Gorantla Madhav Video Call : ఏపీలో పొటిలికల్ హీట్ పెంచిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో

ఇదిలాఉంటే న్యూడ్ వీడియో కాల్ పై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తాను జిమ్ లో తీసుకున్న వీడియోను ఇలా మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఫోరేన్సిక్ విచారణకు సిద్ధమన్నారు. ఇక మాధవ్ వీడియోలను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. గోరంట్ల మాధవ్ వీడియో ఘటనపై వైసీపీ అగ్రనేతలు స్పందించారు. వీడియో నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని అన్నారు.

Gorantla Madhava Video : వీడియో ఒరిజ‌న‌ల్ అని తేలితే మాధ‌వ్‌పై చ‌ర్య‌లు తప్పవు

తాజాగా గోరంట్ల మాధవ్ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. సత్వర విచారణ చేయాలని డీజీపీకి పద్మ లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాల్సిన అవసరం వుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.