MP Rammohan Naidu : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతోంది-రామ్మోహన్ నాయుడు

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్.. పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎంపీ మాధవ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇందులో తాము ఎలాంటి రాజకీయాలు చేయడం లేదన్నారు.

MP Rammohan Naidu : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతోంది-రామ్మోహన్ నాయుడు

MP Rammohan Naidu : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఎంపీ మాధవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడుం పని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో కులాల మధ్య చిచ్చు కూడా రాజేసింది. కాగా, అది ఫేక్ వీడియో అని మాధవ్ అంటున్నారు. రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ, జనసేన నేతల హస్తం ఉందంటున్నారు. మాధవ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలనూ కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

Gorantla Madhav Video : ‘ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఓవర్ చేయొద్దు’..అంటూ వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియో ఆధారంగా అధికార పార్టీని ప్రతిపక్ష టీడీపీ టార్గెట్ చేసింది. వీడియోని ఎవరు లీక్ చేస్తే ఏంటి? అందులో ఉన్నది నువ్వా? కాదా? అని టీడీపీ నేత వంగలపూడి అనిత గోరంట్ల మాధవ్ ను ప్రశ్నించారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు.

Anitha Reddy On Gorantla Madhav Video : గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ నేను కాదు-అనితా రెడ్డి

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎంపీ మాధవ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇందులో తాము ఎలాంటి రాజకీయాలు చేయడం లేదన్నారు. మాధవ్ తీరు ఎంపీలు తలదించుకునే విధంగా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎంపీ మాధవ్ ను వైసీపీ ప్రభుత్వం వెనకేసుకొస్తోందని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వీడియో దుమరాం రేపడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మాటా మార్చారని అన్నారు. పార్లమెంట్ స్థాయిని ఎవరు తగ్గించినా ఓ ఎంపీగా తాను స్పందిస్తానని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. మాధవ్ ను టచ్ చేసేందుకు జగన్ భయపడుతున్నారని అన్నారు. మాధవ్ లానే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఉన్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందనే భయం వెంటాడుతోందన్నారు.