Tollywood Heros : వరుసగా గాయాలు, ఆపరేషన్స్‌తో బాధ పడుతున్న హీరోలు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అంతా..
టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు గాయాలతో బాధపడుతున్నారు. (Tollywood Heros)
Tollywood Heros
Tollywood Heros : టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు గాయాలతో బాధపడుతున్నారు. సీనియర్, జూనియర్ అని లేకుండా స్టార్ హీరో, చిన్న హీరో అని లేకుండా అందరూ గాయాల బారిన పడుతున్నారు. సినిమా షూటింగ్స్ లో కష్టపడి దెబ్బలు తగిలించుకుంటున్నారు. తాజాగా నేడు ఎన్టీఆర్ గాయంతో ఈ లిస్ట్ ఇంకా పెరిగింది.
నేడు ఎన్టీఆర్ కి డ్రాగన్ సినిమా షూటింగ్ లో భుజానికి గాయం అయింది. దీంతో చికిత్స చేసిన వైద్యులు కనీసం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారు పవన్. మరో భుజానికి ఆపరేషన్ ఇంకొన్నాళ్ల తర్వాత చేస్తామని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం పవన్ చేతికి కట్టుతోనే విధుల్లో పాల్గొంటున్నారు. మరో పక్క OG 2 కూడా మరింత ఆలస్యం కానుంది ఈ ఆపరేషన్ తో.
Also Read : NTR : ఎన్టీఆర్ కి గాయం.. రెండు నెలలు రెస్ట్.. ఆందోళనలో అభిమానులు..
బాలయ్య కూడా ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ లో ఉన్నారు. ఇటీవల NBK111 సినిమా షూటింగ్ లో గాయపడ్డారు బాలయ్య. దీంతో బాలకృష్ణ మోకాలికి గాయం అయి ఆపరేషన్ వరకు వెళ్ళింది. ఆపరేషన్ పూర్తిచేసుకొని ప్రస్తుతం బాలయ్య హాస్పిటల్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. కనీసం నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో NBK111 షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.
ఇవాళ ఉదయమే రామ్ చరణ్ కు కూడా మణికట్టుకు ఆపరేషన్ చేసారు. పెద్ది సినిమా సమయంలో చరణ్ కు అనేక గాయాలు అయ్యాయి. కంటి దగ్గర గాయం అయినా చికిత్స చేసుకొని వెంటనే షూటింగ్ లో పాల్గొన్నాడు. మణికట్టు దగ్గర గాయం అవ్వడంతో టెంపరరీగా థెరపీ చేయించుకుంటూ పెద్ది రిలీజ్, ప్రమోషన్స్ కోసం ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఉదయమే కోయంబత్తూర్ లో చరణ్ ఆపరేషన్ చేయిచుకొని ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నాడు.
వరుణ్ తేజ్ కూడా ఇటీవల బరి సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. వరుణ్ కాలికి గాయం అవ్వడంతో అతనికి కూడా ఆపరేషన్ జరిగింది. దీంతో నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు వరుణ్. ఇటీవల తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా కర్ర సాయంతో నడుచుకుంటూ వచ్చాడు వరుణ్.
Also Read : Ram Charan : రామ్ చరణ్ ఆపరేషన్ పూర్తి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు..
చిరంజీవికి మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ లో మోకాలి ఆపరేషన్ జరిగింది. దాంతో ఓ నెల రోజులు బయటకు రాలేదు. అఖిల్ కి కూడా తన ఇంట్లో జారి పడి గాయం అవ్వడంతో ఆపరేషన్ జరిగిందని, దానివల్ల లెనిన్ షూటింగ్ ఆగిందని, అందుకే సినిమా ఆలస్యం అయిందని ఇటీవల లెనిన్ ప్రమోషన్స్ లో తెలిపాడు. ప్రభాస్ కి కూడా కొన్ని రోజుల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగిందని వార్తలు వచ్చాయి.
సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు అని, చికిత్స అనంతరం కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూట్ మొదలుపెట్టాడని వార్తలు వచ్చాయి. పలువురు చిన్న నటులు కూడా షూటింగ్స్ లో గాయాల పాలైన వార్తలు ఇటీవల వచ్చాయి. ఇలా వరుసగా హీరోలంతా గాయాల పాలవడం, అవి ఆపరేషన్ వరకు వెళ్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోలు త్వరగా కోలుకోని రావాలని, మళ్ళీ యాక్టివ్ గా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
