Ram Charan : రామ్ చరణ్ ఆపరేషన్ పూర్తి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు..
చరణ్ నేడు మణికట్టుకు ఆపరేషన్ చేయించుకున్నారు.(Ram Charan)
Ram Charan
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పెద్ది సమయంలో గాయపడగా మణికట్టుకు బలమైన గాయం అయిన సంగతి తెలిసిందే. ఆ గాయానికి మణికట్టుకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నా సినిమా రిలీజ్, ప్రమోషన్స్ కోసం వాయిదా వేసుకున్నారు చరణ్. టెంపరరీగా థెరపీ తీసుకుంటున్న చరణ్ నేడు మణికట్టుకు ఆపరేషన్ చేయించుకున్నారు.
కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రికి చరణ్ నిన్న తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. నేడు ఉదయం డాక్టర్ రాజశేఖరన్ ఆధ్వర్యంలో చరణ్ మణికట్టుకు ఆపరేషన్ జరిగింది. ఈ క్లిష్టమైన సర్జరీలో అమెరికాకు చెందిన మణికట్టు స్పెషలిస్ట్, డాక్టర్ అలెజాండ్రో బేడియా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం చరణ్ ఆపరేషన్ పూర్తి చేసుకొని హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.
Also Read : Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ సీక్వెల్ కూడా.. వరుణ్ తేజ్ ప్లానింగ్..
రెండు మూడు రోజుల్లో చరణ్ ని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ తర్వాత చరణ్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. దీంతో అభిమానులు చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ మణికట్టు ఆపరేషన్ తో చరణ్ – సుకుమార్ సినిమా మరింత ఆలస్యంగా మొదలు కానుంది.
