Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ సీక్వెల్ కూడా.. వరుణ్ తేజ్ ప్లానింగ్..
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Korean Kanakaraju)
Korean Kanakaraju
Korean Kanakaraju : గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్న వరుణ్ తేజ్ త్వరలో కొరియన్ కనకరాజు సినిమాతో రాబోతున్నాడు. వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా రితిక నాయక్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. కొరియన్ కనకరాజు సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఇండైరెక్ట్ గా తెలిపింది. మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రితిక నాయక్ హింట్ ఇచ్చేసింది. సినిమా ఎండింగ్ లో పార్ట్ 2 కి లీడ్ ఉంటుందని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan : వారాహి అమ్మవారిపై సుమంత్ సినిమా.. గెస్ట్ గా పవన్ కళ్యాణ్..?
టాలీవుడ్ సమాచారం ప్రకారం కొరియన్ కనకరాజు కథ విషయానికొస్తే.. ఓ రాయలసీమ కుర్రాడు, అక్కడే కొరియన్ కార్ కంపెనీ కియాలో పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో కొరియా నుంచి ఓ ఆత్మ ఉన్న బాక్స్ ఒకటి అనుకోకుండా ఇండియాకు రావడం, అది హీరోకి దొరకడం ఆ ఆత్మ హీరో శరీరంలో చేరి హీరోయిన్ తో కలిసి కొరియాకు వెళ్లి అక్కడ ఆ ఆత్మ పగకు రివెంజ్ తీసుకునే కథాంశంతో హారర్ కామెడీ యాక్షన్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
వరుస ఫ్లాప్స్ చూసిన వరుణ్ ఈ సీక్వెల్ తో గట్టిగానే తన కెరీర్ ని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కొరియన్ కనకరాజు సినిమా తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నేషనల్ అవార్డు సాధించిన కమిటీ కుర్రాళ్ళు దర్శకుడు యదు వంశీతో బరి అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కొరియన్ కనకరాజు సీక్వెల్ ఉండబోతుందని తెలుస్తుంది.
