Pawan Kalyan : వారాహి అమ్మవారిపై సుమంత్ సినిమా.. గెస్ట్ గా పవన్ కళ్యాణ్..?
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : సుమంత్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మహేంద్రగిరి వారాహి. స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాని సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సంతోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరంతా ఊహించినట్టే పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్ గా పిలవాలి అనుకుంటున్నాము. అందుకోసం ట్రై చేస్తున్నాము కూడా అని తెలిపారు.
Also Read : Anakapalli Trailer : ‘అనకాపల్లి’ ట్రైలర్ రిలీజ్.. నిర్మాత, నటుడిగా మారిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్ళుగా వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ, వారాహి నవరాత్రి పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన ఎన్నికల ప్రచార వాహనానికి కూడా వారాహి అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేంద్రగిరి వారాహి సినిమా కూడా ఓ ఊళ్ళో వారాహి అమ్మవారు, ఆ ఊరి చుట్టూ తిరిగే మిస్టరీ సినిమాగా తీస్తుండటంతో పవన్ కళ్యాణ్ ని ఈ సినిమా ప్రమోషన్స్ కి తీసుకొస్తే మరింత ప్రమోషన్ దొరుకుతుందని, పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వారాహి అమ్మవారి గురించి మాట్లాడతారని మూవీ యూనిట్ భావిస్తున్నారు.
మూవీ యూనిట్ అయితే పవన్ కళ్యాణ్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మరి పవన్ వస్తారా లేదా చూడాలి. ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలని కోరుకుంటున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనున్నట్టు సమాచారం.
