KCR Biopic : హీరో దొరికేసాడు.. కేసీఆర్ బయోపిక్ రెడీనా?
మల్లేశం బయోపిక్ లో నటించి మెప్పించిన ప్రియదర్శి ఇప్పుడు కేసీఆర్ పాత్రలో కాసేపు కనిపించి తెలంగాణలో చర్చగా మారారు. (KCR Biopic)
KCR Biopic
KCR Biopic : నాని ది ప్యారడైజ్ సినిమా ఎలా ఉన్నా అందులో కేసీఆర్ పాత్రని పోలిన రాజకీయ నాయకుడిగా నటుడు ప్రియదర్శి కనిపించి అదరగొట్టాడు. సినిమాలో అచ్చం కేసీఆర్ నటించినట్టే ఉందని, ప్రియదర్శి కేసీఆర్ పాత్రలో అచ్చుగుద్దినట్టు సెట్ అయ్యాడని అంటున్నారు ప్రేక్షకులు. కమెడియన్ గా, నటుడిగా, హీరోగా విలక్షణ పాత్రలు పోషిస్తున్నాడు ప్రియదర్శి.
ఆల్రెడీ మల్లేశం బయోపిక్ లో నటించి మెప్పించిన ప్రియదర్శి ఇప్పుడు కేసీఆర్ పాత్రలో కాసేపు కనిపించి తెలంగాణలో చర్చగా మారారు. గతంలో పలు సినిమాల్లో కేసీఆర్ పాత్ర కనిపించినా అందులో నటించిన నటులెవరూ ఇంతగా ఆ పాత్రకు పేరు తీసుకురాలేదు. కానీ ప్రియదర్శి కేసీఆర్ బయోపిక్ కి హీరోగా సరిపోతాడు అనేలా ఆ పాత్ర ఫేమ్ తెచ్చుకుంది.
Also Read : Bigg Boss 10 Shalini : అపూర్వ రాకతో భయపడుతున్న షాలిని.. రోహిత్ విషయంలో మండుతున్నట్టుంది..
గతంలో కేసీఆర్ బయోపిక్ తీస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయ నాయకుడిగా, తెలంగాణ మొదటి సీఎంగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా కేసీఆర్ జీవితకథని బయోపిక్ తీద్దామని గతంలో టాలీవుడ్ లో చర్చలు జరిగాయి. రాజకీయ వర్గాల్లో కూడా దీని గురించి వినిపించింది. అయితే ఆయన పాత్రని పర్ఫెక్ట్ గా పోషించగలిగే నటుడి కోసం ఇన్నాళ్లు ఎదురుచూసారు. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాలో ప్రియదర్శిని చూసిన తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో కేసీఆర్ బయోపిక్ చర్చ మొదలయింది. పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే కేసీఆర్ బయోపిక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాని టాక్.
అయితే కేసీఆర్ బయోపిక్ లో ఆయన జననం, విద్యార్ధి జీవితం, పర్సనల్ లైఫ్, విద్యార్ధి నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటంతో సాగి తెలంగాణ వచ్చాక మొదటి సీఎం అయ్యేంతవరకు చూపిస్తారని చర్చ జరుగుతుంది. ప్రియదర్శి ఎలాగో తెలంగాణ ప్రాంతానికి చెందిన నటుడే కాబట్టి యాస విషయంలో ఇంకా ఈజీ అవుతుంది. మరి కేసీఆర్ బయోపిక్ ప్రియదర్శితో తెరకెక్కించే చర్చలు సఫలమవుతాయా చూడాలి.
Also See : Sowmya Rao : ఎద్దులబండి ఎక్కిన సీరియల్ నటి.. యాంకర్ సౌమ్య ఫొటోలు..
