AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
AP Inter Results 2023: 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.

AP Inter Results 2023(Photo : Google)
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. గంటన్నర ఆలస్యంగా రిజల్ట్స్ వెలువడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.
అయితే మంత్రి బొత్స.. అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ వెంట ఉన్నారు. జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో వీరు రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి మంత్రి బొత్స విజయవాడకు చేరుకోలేకపోయారు.
దీంతో ఫలితాలను ఆలస్యంగా విడుదల చేశారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. విద్యార్థులు bieap.apcfss.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోనూ రిజల్ట్స్ చూడొచ్చు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.
4.84 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 5.19 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ కు అటెండ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.
పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డు.
http://examresults.ap.nic.in/
https://bieap.apcfss.in/
http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లలో ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.