AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు.. జిల్లాల వారిగా పోస్టుల వివరాలు ఇలా.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు..

రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.

AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు.. జిల్లాల వారిగా పోస్టుల వివరాలు ఇలా.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు..

AP Mega DSC 2025

Updated On : May 1, 2025 / 2:30 PM IST

AP DSC 2025: ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో క్రీడాకారుల కోసం ప్రత్యేక కోటాను అమలు చేయనున్నారు. క్రీడాకారుల కోసం 421 పోస్టులు కేటాయించినట్లు ఏపీ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు.

Also Read: PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి టూర్.. జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం..

రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు 30రోజుల పాటు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. https://sports.ap.gov.in అనే వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను క్రీడా రంగంలో వారి ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్ల విషయంలో ఉక్కుపాదం మోపుతామని, ఎటువంటి అవకతవకలకు చోటులేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు.

Also Read: May 1st New Rules : బిగ్ అలర్ట్.. మే 1 నుంచి రానున్న కొత్త మార్పులివే.. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

ఉమ్మడి జల్లాల వారీగా క్రీడాకోటా కింద 421 పోస్టుల వివరాలు..
కర్నూల్ – 73
చిత్తూరు – 41
తూర్పుగోదావరి – 38
కృష్ణా – 34
గుంటూరు – 33
విశాఖపట్టణం – 32
పశ్చిమగోదావరి – 29
అనంతపురం – 22
వైఎస్ఆర్ – 20
ప్రకాశం – 20
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 17
శ్రీకాకుళం – 16
విజయనగరం – 10
జోన్ల వారీగా..
జోన్ -1 : 6
జోన్-2 : 6
జోన్-3 : 11
జోన్-4 : 11
రాష్ట్ర స్థాయి : 2

 

పాఠశాలల యాజమాన్యాల వారీగా పోస్టులు
ఎంపీపీ, జడ్పీపీ పాఠశాలల్లో 333 పోస్టులు
మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో 30 పోస్టులు
ఆశ్రమ పాఠశాలల్లో 22 పోస్టులు
గురుకుల పాఠశాలల్లో రెండు పోస్టులు
మోడల్ స్కూల్స్ లో నాలుగు పోస్టులు
సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏడు పోస్టులు
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 23 పోస్టులు