Karumuri Nageswara Rao : చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయం : మంత్రి కారుమూరి

నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.

Karumuri Nageswara Rao : చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయం : మంత్రి కారుమూరి

Karumuri Nageswara Rao (1)

Updated On : May 5, 2023 / 11:46 AM IST

Karumuri Nageswara Rao : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయం అన్నారు. స్టే లు తెచ్చుకుని తప్పించుకుంటున్నావని చంద్రబాబును ఉద్దేశించి కారుమూరి మాట్లాడారు. చంద్రబాబు లెగ్ మహిమతో అధికారంలో ఉండగా వర్షాలు లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఉన్నారని పేర్కొన్నారు. దళారులతో రైతులు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడించారని విమర్శించారు.

చంద్రబాబు తీరు దోచుకొ, దాచుకో అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ప్రతి రోజు మీటింగలు ఏర్పాటు చేశాడు తప్ప ప్రజలకు న్యాయం చేసిందేమీ లేదని విమర్శించారు. నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.

Karumuri Nageswara Rao : వివేకా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని నా అనుమానం : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

అకాల వర్షాలకు నష్టం లేకుండా సీఎం జగన్ అదేశాలతో అధికారులను అప్రమత్తం చేసి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తుందని చెప్పారు. టీడీపీ నాయకులే సీఎం జగన్ నిర్ణయాలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. తాము ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా ధాన్యం తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో రూ.2కోట్ల 10లక్షల ధాన్యం డబ్బులు జమ చేశామని చెప్పారు.

చంద్రబాబు 2014లో ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే ఇచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు సివిల్ సప్లై వ్యవస్థను నాశనం చేసి రూ.4,999కోట్లు పసుపు కుంకుమ కింద తగలేశాడని విమర్శించారు. మళ్ళీ జగనే కావాలి, రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.

Karumuri Nageswara Rao : రైతుల కల్లాల దగ్గరికే వెళ్లి ధాన్యం కొనుగోలు-మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

రైతుకు రూ.1,530 ధర అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సీఎం జగన్ అందరికి న్యాయం చేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో చంద్రబాబు, లోకేశ్ అద్దాల మేడలో దాకున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, నక్క జిత్తుల మాటలు మాట్లాడటం మానుకుని నిజాలు మాట్లాడితే మంచిదని హితవు పలికారు.