మాటకు మాట : ఏం పేరు పెట్టాలో పవనే చెప్పాలి – కొడాలి నాని

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 11:13 AM IST
మాటకు మాట : ఏం పేరు పెట్టాలో పవనే చెప్పాలి – కొడాలి నాని

Updated On : November 16, 2019 / 11:13 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఏం పేరు పెట్టాలో ఆయనే చెప్పాలన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై వస్తున్న విమర్శలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అని పేరు పెట్టి పిలిస్తే..తప్పేంటీ..ఆయనను ఏ విధంగా పిలవాలో వైసీపీ పార్టీ  ఎమ్మెల్యేలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని పవన్ చేసిన కామెంట్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

2019, నవంబర్ 16వ తేదీ శనివారం మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఏమీ దొరకడం లేదని, జగన్‌ను ఏమని పిలవడానికి తాము మీటింగ్ పెట్టుకోవాలని అన్నారని పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌‌కు కూడా వివిధ రకాల పేర్లు ఉన్నాయని, తండ్రి కళ్యాణ్ బాబు పేరు పెడితే..అన్నయ్య పవన్ కళ్యాణ్ అని, అభిమానులు పవర్ స్టార్..యాక్టింగ్, డ్రామా చూసి పవన్ నాయుడు అని, దురాభిమానులు ప్యాకేజీ స్టార్ అని పేర్లు పెట్టారని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు కోల్పోయిన వారందరినీ కూర్చొబెట్టి..చర్చించి..ఏం పెట్టాలని డిసైడ్ చేసుకోవాలన్నారు మంత్రి కొడాలి నాని. ఈ కామెంట్స్‌పై జనసేన, అధినేత పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 
Read More : జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని విడుదల