ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్ఈసీ ఎలా అయ్యారు ?

ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్ఈసీ ఎలా అయ్యారు ?

Updated On : February 5, 2021 / 8:49 PM IST

Minister Peddireddy fires over SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ సురేష్ కుమార్ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ-వాచ్ యాప్ ను వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ తీర్పుతో ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశాక రద్దు చేసి ఉపయోగమేంటని పేర్కొన్నారు.

చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు మేలు చేయడం కోసమే నిమ్మగడ్డ పని చేస్తున్నారని విమర్శించారు. నిమ్మగడ్డ.. అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఏకగ్రీవాలు చట్ట విరుద్ధమని ఏ చట్టంలో ఉందో నిమ్మగడ్డ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గురించి నిమ్మగడ్డకు పూర్తిగా తెలీదన్నారు. ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్ఈసీ ఎలా అయ్యారని ఎద్దేవా చేశారు.