Minister Sidiri Appalaraju : చంద్రబాబు, బీఆర్ఎస్ దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్న పవన్ కల్యాణ్ : మంత్రి సీదిరి అప్పలరాజు

తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే పవన్ ఏనాడైనా మాట్లాడాడా అని నిలదీశారు. పవన్.. వీలైతే తెలంగాణ నాయకులకు బుద్ధి చెప్పండన్నారు.

Minister Sidiri Appalaraju : చంద్రబాబు, బీఆర్ఎస్ దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్న పవన్ కల్యాణ్ : మంత్రి సీదిరి అప్పలరాజు

Minister Sidiri Appalaraju

Updated On : April 17, 2023 / 7:42 PM IST

Minister Sidiri Appalaraju : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు చేశారు. ఏపీ మంత్రులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. పవన్ కల్యాణ్ మాటల వెనుక అంతుచిక్కని మర్మం ఉంటుందన్నారు. తెరవెనుక ఏదో జరిగి బయటకు మాట్లాడటానికి వస్తాడనుకుంటానని చెప్పారు. పవన్ కల్యాణ్ కి కోట్ల రూపాయిలు బీఆర్ఎస్ ప్యాకేజీలు ఇవ్వడానికి చర్చలు జరిగాయని వార్తల్లో చూశానని తెలిపారు.

నేడు పవన్ కల్యాణ్ మాటలు చూస్తుంటే.. అది నిజమేనేమో అనిపిస్తుందన్నారు.  ఆంధ్రాలో చంద్రబాబు దగ్గర ప్యాకేజ్, తెలంగాణలో బీఆర్ఎస్ దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్నట్లున్నారని ఆరోపించారు. వరంగల్ ఆసుపత్రిలో డాక్టర్ చనిపోతే మాట్లడలేదేం? రోగులను స్ట్రేక్చర్ లేక ఈడ్చుకెలితే మాట్లాడావా? గోదావరి జలాల గురించి మాట్లాడవేం పవన్ అని ప్రశ్నించారు. రహస్య ఓప్పందాలను పవన్ బయటకు చెప్పాలన్నారు.

Seediri Appalaraju: మాకు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ.. ఈ పార్టీతో సమానం: మంత్రి సీదిరి అప్పలరాజు

ఆంధ్రాలో ఉన్న అభివృద్ధి.. తెలంగాణలో ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ వారు ఓ జిల్లా ఆసుపత్రి ఫొటో పెట్టారు.. తాము ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నామని చెప్పారు. తమ నాయకుడి గురించి, పరిపాలన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదని.. ఎంత దాకైనా వెళ్లామన్నారు.

‘మా రాష్ట్రం గురించి తక్కువగా మాట్లాడటానికి.. మీకేం హక్కు ఉంది… రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి’ అని అన్నారు. తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే పవన్ ఏనాడైనా మాట్లాడాడా అని నిలదీశారు. తాము ఏం మాట్లాడుతున్నామో తమకు తెలుసని.. తెలివి ఉండే మాట్లాడుతున్నామని చెప్పారు. పవన్.. వీలైతే తెలంగాణ నాయకులకు బుద్ధి చెప్పండన్నారు.