రెయిన్ అలర్ట్.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు

ఏపీలోని ఆయా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

రెయిన్ అలర్ట్.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు

AP Rains

Updated On : July 18, 2025 / 7:02 AM IST

Rain Alert: గత నెలలో దంచికొట్టిన వర్షాలు ఈనెల ప్రారంభం నుంచి మొఖం చాటేశాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని విత్తు నాటిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వేడి, ఉక్కపోతతో కొద్దిరోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈదురు గాలులు వీచే అవకాశ ఉందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Also Read: ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు.. వీటిలో ఏ పార్టీకి ఎన్నంటే?

శుక్రవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగాయి. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో 3 నుంచి ఆరు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.