ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు.. వీటిలో ఏ పార్టీకి ఎన్నంటే?
ఏపీలో ఇప్పటికే పలు దశలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు పడింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఖరారయ్యాయి. 9 ఏఎంసీలలో జనసేన వారికి, 4 ఏఎంసీలలో బీజేపీ వారికి చైర్మన్ లుగా అవకాశం దక్కనుంది. 66 చైర్మన్ పదవుల్లో 17 మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, ఐదుగురు ఎస్టీలకు, ఐదుగురు మైనారిటీలకు చోటు దక్కుతుంది. 66 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 35 చోట్ల మహిళలకు అవకాశం లభించనుంది.
ఏపీలో ఇప్పటికే పలు దశలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. పదవులు ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఎలాంటి పదవులు దక్కబోతున్నాయన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుంది.
గత ఎన్నికల్లో సీట్లు రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి న్యాయం చేసేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనేది తేలనుంది.
మిగిలిన నామినేటెడ్ పదవులకు హెవీ కాంపిటేషన్ ఉంది. పార్టీకోసం కష్టపడిన వారందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తానని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు.