Covid 2nd Wave Management : కరోనా సెకండ్ వేవ్ మేనేజ్‌మెంట్‌లో ఏపీకి రెండో ర్యాంకు

కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించింది.

Covid 2nd Wave Management : కరోనా సెకండ్ వేవ్ మేనేజ్‌మెంట్‌లో ఏపీకి రెండో ర్యాంకు

Ap Second Rank

Updated On : June 30, 2021 / 11:54 AM IST

Covid 2nd Wave Management : కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 17 ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ ర్యాంకులో నిలిచింది.

రెండవ వేవ్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి 54శాతం మంది రేటింగ్ ఇచ్చారు. ఈ సర్వేలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో సగటున 70 రోజువారీ కేసులు ఉండగా.. మే 16 నాటికి 24,171 కేసులతో ఏపీలో ఒక్కసారిగా పెరిగాయి. రెండవ వేవ్ తీవ్రత కారణంగా ఆక్సిజన్ కొరత ఐసియూ బెడ్ల కొరతకు దారితీసింది.

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగిపోవడంతో మే 5 నుంచి ఏపీలో పాక్షిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. గత నాలుగు వారాల్లో కేసుల పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ సరఫరా, పడకల లభ్యత వంటివి మెరుగుపడ్డాయి. ప్రతి రాష్ట్రంలో మహమ్మారి నిర్వహణ సామర్థ్యాన్ని పర్యవేక్షించినట్టు లోకల్ సర్కిల్స్ సర్వే పేర్కొంది. ఏపీలోని పౌరులను రెండవ వేవ్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రేటింగ్ ఇవ్వాలని కోరింది.