Summer Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 48 రోజులు సమ్మర్ హాలీడేస్.. ఎప్పటినుంచంటే?
సమ్మర్ హాలీడేస్‌లో పాఠశాల పిల్లలు సమయాన్ని సరదాగానూ గడపాలి, అలాగే, మీ నాలెడ్జ్‌ను పెంచుకునేలానూ గడపాలి.

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఈ సారి 48 రోజులు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. అన్ని స్కూళ్లకు బుధవారం ఈ ఏడాది చివరి పని దినం కానుంది.
Also Read: రూ.లక్ష దాటిపోయిన 10 గ్రాముల బంగారం ధర.. పరుగో పరుగు.. ఇక సామాన్యుడు కొనలేడా?
వేసవి సెలవుల్లో ఇలా గడపండి
సమ్మర్ హాలీడేస్‌లో పాఠశాల పిల్లలు సమయాన్ని సరదాగానూ గడపాలి, అలాగే, మీ నాలెడ్జ్‌ను పెంచుకునేలానూ గడపాలి. ఇందుకోసం తల్లిదండ్రులు ఓ ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది. చదువులో పిల్లల అభిరుచి పెంచేందుకు కథలు, బాల పత్రికలు, కార్టూన్ బుక్స్ చదివించాలి.
స్థానిక గ్రంథాలయాల వద్దకు పిల్లలను తీసుకెళ్లాలి. కొత్త పదాలు నేర్చుకోవడం, కథలు రాయడం వంటిని నేర్చుకునేలా చేయాలి. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, క్రాఫ్ట్ పనులు వంటివి నేర్పించవచ్చు. పజిల్స్, సుడోకు, చెస్ వంటిని మీ పిల్లల తెలివితేటలను, సమయస్ఫూర్తిని పెంచుతాయి.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి