రూ.లక్ష దాటిపోయిన 10 గ్రాముల బంగారం ధర.. పరుగో పరుగు.. ఇక సామాన్యుడు కొనలేడా?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది.

రూ.లక్ష దాటిపోయిన 10 గ్రాముల బంగారం ధర.. పరుగో పరుగు.. ఇక సామాన్యుడు కొనలేడా?

Gold

Updated On : April 22, 2025 / 10:39 AM IST

దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటిపోయింది. ఈ మార్కును దాటుతుందని కొన్ని రోజులుగా విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. ఇవాళ అదే జరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ఉదయం రూ.3,000 పెరిగి, రూ.1,01,350కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.2,750 పెరిగి, రూ.92,900గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.3,000 పెరిగి రూ.1,01,350గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.76,010గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,750 పెరిగి రూ.93,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.3,000 పెరిగి రూ.1,01,500గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి 76,140గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.2,750 పెరిగి, రూ.92,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.3,000 పెరిగి రూ.1,01,350గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.76,010గా ఉంది.

వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,000గా ఉంది
  • ముంబైలో కిలో వెండి రూ.1,01,000గా ఉంది

NOTE: పసిడి ధరల్లో గంటల వ్యవధిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కస్టమర్లు బంగారం కొనే సమయం నాటికి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.