ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముహుర్తం ఖరారు

  • Published By: vamsi ,Published On : November 17, 2020 / 03:50 PM IST
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముహుర్తం ఖరారు

Updated On : November 17, 2020 / 4:17 PM IST

Ap Sec Nimmagadda ramesh Kumar:కొవిడ్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరిస్థితులు కారణంగా.. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని, మున్సిపల్ ఎన్నికలను ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో మార్చి నెలలో నిర్వహించాలని నిర్ణయించుకోగా.. అప్పుడు వాయిదా పడిన ఎన్నికలను 2021 ఫిబ్రవరిలో నిర్వహించేలా ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.




కరోనా పరిస్థితుల కారణంగా పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని, ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని రాజ్యాంగ పరమైన అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ ఆ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ మేరకు మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వచ్చాయని, తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరం అని ఆయన అన్నారు.
https://10tv.in/five-of-same-family-missing-in-nellore-district/



అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరం అని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు.