టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ

టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ

Updated On : February 4, 2021 / 9:33 PM IST

TDP manifesto canceled : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఏపీ ఎస్ఈసీ రద్దు చేసింది. టీడీపీ వివరణ సరిగా లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. వెంటనే మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 4, 2021) టీడీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు.

టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో కాపీలను ప్రచురించడం, పంపిణీ చేయడం నిషిద్ధమని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.