కరోనా నిరోధక చర్యలపై బులెటిన్..ఆందోళన చెందొద్దు
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారని తెలిపారు. కొవిడ్-19 విషయంలో ఆందోళన చెందొద్దన్నారు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని అన్నారు. కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని తెలిపారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు.
కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 675 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు. 428 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. 61 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా, 52 మందికి నెగటివ్ అని తేలిందన్నారు. ఎనిమిది మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు.
కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టామన్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో 8691 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలున్నాయని తెలిపారు. వైజాగ్/గన్నవరం ఓడరేవులో 1088 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని..వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవన్నారు. క్రిష్ణపట్నం ఓడరేవులో 622 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని.. వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవని తేల్చి చెప్పారు.
కొవిడ్-19 ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలున్నా లేకపోయినా ఇళ్లల్లోనే ఉండాలని…బయటికి వెళ్లకూడదన్నారు. కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ ను ధరించి సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని సూచించారు. 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలన్నారు. అన్ని జిల్లాల్లో నూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని తెలిపారు.