AP TET 2024 Final Answer Key : ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేస్తోంది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP TET 2024 Final Answer Key : ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు వారి పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.

AP TET 2024 Final Answer Key ( Image Source : Google )
AP TET 2024 Final Answer Key : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ అక్టోబర్ 27న (ఆదివారం) విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ టెట్ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, aptet (apcfss.in) ద్వారా ఆన్సర్ కీని యాక్సెస్ చేయవచ్చు.
ఆన్సర్ కీని పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు వారి పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. ఏపీ టెట్ 2024 రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 1 నుంచి 5 తరగతులకు ఔత్సాహిక ఉపాధ్యాయుల కోసం రూపొందించారు.
అయితే, పేపర్ 2లో 6 నుంచి 8 తరగతులకు బోధించే సిలబస్ ఉంటుంది. ఈ టెట్ పరీక్ష రెండు సెషన్లలో అక్టోబర్ 3 నుంచి 21 మధ్య జరిగింది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అక్టోబరు 4న ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేయగా అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు అక్టోబర్ 5 వరకు అనుమతించారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఏపీ టెట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని యాక్సెస్ చేసేందుకు అభ్యర్థులు ఈ కింది విధంగా ప్రయత్నించండి
- ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్ (aptet.apcfss.in)ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో ‘క్వశ్చన్‌మార్క్ కీ’ సెక్షన్‌కు నావిగేట్ చేయండి.
- ‘అభ్యర్థి లాగిన్’పై క్లిక్ చేసి, అవసరమైన లాగిన్ వివరాలను అందించండి.
- ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్‌అవుట్‌ను ఉంచుకోండి.
ఏపీటెట్-2024ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించింది. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష జరిగింది. ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష కోసం సమీప జిల్లాల్లో వసతి కల్పించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ద్వారా నిర్దేశించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉపాధ్యాయ నాణ్యత కోసం జాతీయ ప్రమాణాలతో ఈ పరీక్షను నిర్వహించారు. నవంబర్ 2న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Read Also : Vijaya Sai Reddy : ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగానీ.. ప్రతిపక్షాన్ని కాదు..!