టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి దాడి

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 09:38 AM IST
టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి దాడి

Updated On : December 10, 2020 / 10:49 AM IST

AP Vaddera Corporation Chairperson : నేనేవెరో తెలుసా ? నన్నే టోల్ ఫీజు కట్టమంటవా ? ఎంత ధైర్యం అంటూ చాలా మంది అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతుంటారు. అంతేగాకుండా..దురుసుగా ప్రవర్తిస్తూ..చేయి చేసుకుంటుంటారు. తాము వీఐపీలమంటూ, ప్రముఖ వ్యక్తులమని..ఫీజులు కట్టకుండా..వెళ్లిపోతున్నారు. వీరిని ఆపిన పాపానికి వాళ్ల చేతుల్లో సిబ్బంది తన్నులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా..ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుంటాయి. కానీ..తాజాగా ఏపీ రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి బయటకొచ్చింది. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి…వీరంగం సృష్టించింది.



2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి ఆమె కారులో వెళుతున్నారు. టోల్ ఫీజు కట్టాలని అక్కడున్న సిబ్బంది ఆమెకు చెప్పారు. ఒక్కసారిగా ఆమె ఆగ్రహానికి గురైంది. నేను ఎవరో తెలియదా ? అంటూ ప్రశ్నించారు. ఫీజు కట్టాల్సిందేనంటూ..పట్టుబట్టారు. టోల్‌ ఫీజు కట్టకుండా వెళ్తున్నారేంటని…ఆమెను ప్రశ్నించారు. వెళ్లడానికి ప్రయత్నించారు. టోల్ గేట్ సిబ్బంది స్టాప్ పేరిట ఉన్న బోర్డులు, బారికేడ్లను ఆమె వాహనానికి అడ్డు పెట్టారు. అంతే..ఆమె కోపం నషాళానికి అంటుకుంది. కారు దిగి…..వీరంగం సృష్టించింది. టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ వారిపై చేయి చేసుకుంది.



నా కారుకు అడ్డంగా బారికేడ్లు పెడతారా..ఎంత ధైర్యం అంటూ వాటిని విసురుగా తోసేసింది. టోల్ సిబ్బంది చెప్పే మాటలు వినిపించుకోకుండా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై చేయి చేసుకుంది. రేవతి వీరంగంతో టోల్‌గేట్ సిబ్బంది, తోటి వాహనదారులు బెంబేలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.