Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. భారీ బందోబస్తు

"జై భవానీ.. జై జై భవానీ" అంటూ అమ్మవారి నామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోతోంది.

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. భారీ బందోబస్తు

Indrakiladri

Updated On : December 21, 2024 / 11:19 AM IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం దేవాలయ ఈవో కేఏస్ రామారావు అగ్ని ప్రతిష్టాపన చేశారు. భారీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.

“జై భవానీ.. జై జై భవానీ” అంటూ అమ్మవారి నామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోతోంది. అమ్మవారి భవానీ దీక్షా విరమణలు సందర్భంగా మొదటిరోజున దుర్గమ్మ దర్శనాలు ప్రారంభమయ్యాయి. భవానీలు తాము తీసుకొచ్చిన నేతి టెంకాయలను హోమంగుండాల్లో వేసి దీక్ష విరమణ చేస్తున్నారు.

భవానీలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ప్రసాదములు అడ్వాన్స్ బుక్ చేసుకున్న వారి కోసం కనకదుర్గ నగర్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. యాప్ లోనే లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చు. కనకదుర్గమ్మ ఆలయంలో 25 వరకు భవాని దీక్ష విరమణలు ఉంటాయి. భక్తులందరికీ ఫ్రీ దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు.

కూటమిలో పంపకాల లొల్లి తప్పదా? పదవి దక్కేదెవరికి?