Gidugu Rudraraju : వైసీపీ మునిగిపోతున్న నావ.. షర్మిల ఏపీకి వస్తే పార్టీలోకి స్వాగతిస్తాం : గిడుగు రుద్రరాజు

వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయింది అంటూ ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని..షర్మిల ఏపీకి వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని అన్నారు.

Gidugu Rudraraju : వైసీపీ మునిగిపోతున్న నావ.. షర్మిల ఏపీకి వస్తే పార్టీలోకి స్వాగతిస్తాం : గిడుగు రుద్రరాజు

Gidugu Rudraraja

Updated On : December 12, 2023 / 5:59 PM IST

AP Congress Politics ..Gidugu Rudraraju : వైసీపీలో రాజీనామాలపై ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10టీవీతో రుద్రరాజు మాట్లాడుతు..వైసీపీ మునిగిపోతున్న నావ అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని..‘కాంగ్రెస్ రావాలి..మార్పు రావాలి’ అనే నినాదంతో కర్ణాటక, తెలంగాణాలో మాదిరి ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైందని..విశాఖతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేల, మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారని అన్నారు. వివిధ విభాగాల ఇన్‌చార్జ్‌లు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లినవారు తిరిగి తమ సొంతపార్టీలోకి రావాలనుకుంటున్నారని అన్నారు.

B.Tech Ravi : టీడీపీలోకి కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు : బీటెక్ రవి

అనుకోని కారణాల వలన కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ చెంతకు చేరినవారు అంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావటానికి రెడీగా ఉన్నారని అన్నారు. తనతో ఇప్పటికే 15 మంది టచ్‌లో ఉన్నారని తెలిపారు. వారితో తాను మాట్లాడానని..రేపటినుంచే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.వైఎస్ షర్మిల ఏపీకి వస్తే స్వాగతిస్తానన్నారు.జగనన్న సంధించిన బాణం ఎటువైపు వెళుతుందో చూడాలన్నారు. వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నేతలు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.

AP Politics : అభ్యర్ధుల్ని కాదు కదా.. పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం : టీడీపీ నేతల సెటైర్లు

2024లో కాంగ్రెస్ కు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని..ఎఐసిసి నేతలతో పాటు ఏపీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.రేపటి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. జనవరిలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఏపీకి వస్తారని.. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయన్నారు.

కాగా..గతంలో కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీకి రెబల్ గా మారిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా  మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇలా వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తు..వైసీపీ మునిగిపోతున్న నావ అంటూ వ్యాఖ్యానించారు.