Amaravati Funds : అమరావతికి భారీగా నిధులు.. రాజధాని నిర్మాణ పనుల్లో ముందడుగు..

ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి ఆమోదం లభించింది.

Amaravati Funds : అమరావతికి భారీగా నిధులు.. రాజధాని నిర్మాణ పనుల్లో ముందడుగు..

Updated On : December 13, 2024 / 2:33 AM IST

Amaravati Funds : అమరావతి నిర్మాణ పనులకు ముందడుగు పడింది. రాజధాని కోసం నిధుల మంజూరుకు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఆమోదం తెలిపింది. మనీలాలో జరిగిన బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి 8వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వనుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీలతో ఏపీ సర్కార్, సీఆర్డీయే చర్చలు జరిపాయి.

వరల్డ్ బ్యాంకు ఆమోద ముద్ర తర్వాత ఒప్పంద పత్రాలు మార్చుకోనుంది ప్రభుత్వం. తొలుత 3వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నాయి ప్రపంచ బ్యాంకు-ఏడీబీ. మిగిలిన నిధులు దశలవారిగా విడుదల చేయనున్నాయి. ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి ఆమోదం లభించింది.

Also Read : వైసీపీకి వరుస షాకుల వెనుక రీజన్‌ ఏంటి? ఉన్నట్టుండి ఆ పార్టీ నేతలు ఎందుకు గుడ్‌బై చెబుతున్నారు?

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ లు అవుతున్నాయి. వరల్డ్ బ్యాంకు, ఏడీబీల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా రాజధానికి రుణాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఏడీబీ బ్యాంకు నుంచి రూ.8వేల కోట్ల రుణం మంజూరు అయినట్లు ఏపీ సర్కార్ కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15వేల కోట్ల రూపాయల వర్క్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కూడా పెట్టింది. 15వేల కోట్ల రూపాయల రుణం ఇప్పించేందుకు కేంద్రం తన సహాయ సహకారాలు అందించింది.

ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి. రాజధానికి సంబంధించి గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్లీ పట్టాలెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా ప్రారంభించారు. జనవరి నుంచి యుద్ధ ప్రాతిపాదికన ఏపీ రాజధాని పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండేళ్లలోనే మొత్తం పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టింది ప్రభుత్వం.