Audimulapu Suresh: పవన్ కల్యాణ్ అన్న ఆ ఒకే ఒక్క మాటతో.. ఈ విషయం అర్థమైపోయింది: మంత్రి సురేశ్
పవన్ తన ఆలోచన భావజాలాన్ని సరిచేసుకోని వస్తే బాగుంటుందని చెప్పారు.

Audimulapu Suresh
Audimulapu Suresh – YCP: ముఖ్యమంత్రి అయ్యే బలం తనకు లేదని జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారని, కేవలం అసెంబ్లీలో అడుగుపెట్టడమే ధ్యేయమంటున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పవన్ చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్యను బట్టి ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని ప్రజలకు అర్థమైపోయిందని విమర్శించారు.
ప్రకాశం జిల్లాలో సురేశ్ మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు వరకు పవన్ కల్యాణ్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని లేదా ప్రతిపక్షంలో భాగంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాడనే ఆలోచన ప్రజల్లో ఉండేదని చెప్పారు. పవన్ స్వార్థం కోసం కేవలం అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచన తప్ప మరొకటి ఏది లేదని ఇప్పుడు అర్థమైందని అన్నారు.
పవన్ తన ఆలోచన భావజాలాన్ని సరిచేసుకోని వస్తే బాగుంటుందని చెప్పారు. పది సంవత్సరాల నుంచి రాజకీయ వనవాసంలో ఉన్నానని పవన్ అంటున్నారని, ఆయన ఎప్పటికీ వనవాసంలోనే ఉంటారని చెప్పారు. రాజకీయాల్లో, ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని స్పష్టమవుతోందని చెప్పారు.
కాగా, జనసేన వారాహి విజయ యాత్రలో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆయనకు ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు.
Perni Nani: నాది అప్పుడు ఒక చెప్పు పోయింది: పేర్ని నాని సెటైర్ మామూలుగా లేదుగా