Balineni Srinivasa Reddy : ఒంగోలు ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా : బాలినేని
తాను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదని తెలిపారు. కానీ, ఇప్పుడు తనకు 60సంవత్సరాలు రావడంతో తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు.

Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy Birthday Celebrations : ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట, జిల్లా వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులు అభిమానులు గజమాలలతో అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2009 నుండి తాను ఎప్పుడు కూడా జన్మదినోత్సవాలు జరుపుకోలేదన్నారు. తన జన్మదినోత్సవం రోజే తన తల్లి చనిపోవడంతో ఆనాటి నుండి తాను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదని తెలిపారు.
కానీ, ఇప్పుడు తనకు 60సంవత్సరాలు రావడంతో తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు. ఇన్ని సంవత్సరాలపాటు తనను రాజకీయంగా ఆదరించిన ఒంగోలు ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో నాయకులందరూ ఎప్పుడు తనకు అండగా ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఎప్పుటికీ తాను మీ కోసమే పని చేస్తానని చెప్పారని తెలిపారు.
B.Tech Ravi : టీడీపీలోకి కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు : బీటెక్ రవి
తాను ఎప్పుడు బయటివారి గురించే ఆలోచిస్తుంటానని తన కుటుంబ సభ్యులు కూడా అంటూ ఉంటారని పేర్కొన్నారు. తన కుమారుడికి ఏమి చేయలేకపోయానని, ఏమీ ఉంచలేకపోయాననే బాధ ఉందన్నారు. కానీ, ఆ దేవుడు ఏదో ఒక రూపంలో కచ్చితంగా తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే తాను ఎవ్వరికి అన్యాయం చేయలేదని తెలిపారు. తన మాటకు ఎదురు చెప్పలేని మంచి కుటుంబాన్ని తనకు ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ణతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
రాబోయే 3నెలల్లో ఎన్నికలు రానున్నాయని తెలిపారు. ఈ 5నెలలు ప్రజలు తన కోసం కష్టపడి పనిచేస్తే రాబోయే 5సంవత్సరాలు వారి కోసం పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంబినేషన్ లో పోటీ చేయబోతున్నానని పేర్కొన్నారు. తమ ఇద్దర్ని ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. బాలినేని కుమారుడు ప్రణిత్ కుమారు రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతోపాటు మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారంటూ పేర్కొన్నారు.
High Court : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు జైలుశిక్ష
డిసెంబర్ లో జన్మించడం బాలినేని అదృష్టం : మంత్రి సురేష్
డిసెంబర్ లో జన్మించడం బాలినేని అదృష్టమని మంత్రి సురేష్ అన్నారు. ఈ పవిత్రమైన డిసెంబర్ నెలలోనే ఏసుప్రభు పుట్టారని తెలిపారు. బాలినేని సున్నిత మనస్తత్వం కలిగినవారని, అది ఆయన బలహీనత అనుకుంటే పొరపాటేనని అని అన్నారు. ఆయనను ఆయనలాగే చూడాలన్నారు. ఆయన ఉన్నంత వరకు ప్రజలు మర్చిపోరని తెలిపారు. బాలినేని నుండి తాము చాలా నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఒంగోలు ప్రజలు ఈసారీ బాలినేనిని భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నానని తెలిపారు.
బాలినేని కుటుంబసభ్యులకు మాగుంట ఆశిస్సులు : ఎంపీ మాగుంట
1991లో తాను ఒంగోలుకు వచ్చినప్పుడు బాలినేని చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే యంగ్ గా కనబడుతున్నాడని ఎంపీ మాగుంట తెలిపారు. బాలినేని తనకు అండగా నిలబడగా మాగుంట కుటుంబం బాలినేనికి అండగా ఉంటూ వస్తోందన్నారు. తమ రెండు కుటుంబాలు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. బాలినేని కుటుంబ సభ్యులకు మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశిస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఇలాగే సాహస్ర చంద్రదర్షనంలా బాలినేని తన 83వ జన్మదిన వేడుకలు జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆ వేడుకలు చూసేందుకు తనకు ఆయుష్యుని ఇవ్వాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానని చెప్పారు.