High Court : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి జైలుశిక్ష

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యడవలి వారి సత్రం అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ రన్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

High Court : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి జైలుశిక్ష

Updated On : December 12, 2023 / 4:09 PM IST

AP High Court : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి జైలుశిక్ష పడింది. ఏపీ హైకోర్టు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ. 2000 జరిమానా విధించింది. జనవరి 2వ తేదిలోగా హై కోర్టు రిజిష్టర్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యడవలి వారి సత్రం అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ రన్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. యడవలి వారి సత్రానికి రూ.25లక్షలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన కారణంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Janardhan Reddy : టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై