వైనాట్ బీసీ స్లోగన్‌తో బ్యానర్లు.. ప్రొద్దుటూరు టికెట్ బీసీలకే ఇవ్వాలని డిమాండ్

వైనాట్ బీసీ స్లోగన్‌తో కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.

వైనాట్ బీసీ స్లోగన్‌తో బ్యానర్లు.. ప్రొద్దుటూరు టికెట్ బీసీలకే ఇవ్వాలని డిమాండ్

BCs demand Proddatur assemby seat and put why not BC posters

Updated On : February 12, 2024 / 11:51 AM IST

Proddatur Assembly constituency: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైనాట్ బీసీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గ సీటును ఈసారి బీసీలకు కేటాయించాలనే డిమాండ్ తో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య వీటిని ఏర్పాటు చేసింది. 1956 నుంచి ఒక సామాజికవర్గానికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తున్నారని గుర్తు చేశారు.

ఏపీలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీలు బలంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈసారి ప్రొద్దుటూరులో అన్ని పార్టీలు తమకే టికెట్ ఇవ్వాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 23 కులాలు ఉన్నాయని అంచనా. మరోవైపు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 18న బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఈ సభ వేదికగా బీసీలు డిమాండ్ చేయనున్నారు. బీసీ ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని బీసీ నాయకులు కోరుతున్నారు.

Also Read: ఆరణి శ్రీనివాసులుకు డబుల్ షాక్‌.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన వైసీపీ అధిష్టానం

కాగా, ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయితే ఈసారి టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇంకా ప్రకటించలేదు. బీసీలు తమకే ఈ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి టికెట్ కేటాయిస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.