శిరోముండన బాధితుడు ప్రసాద్ అదృశ్యం

Beheading victim disappears : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో బాధితుడు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. బాధితుడు ప్రసాద్.. నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతని భార్య కౌసల్య సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది.. ఇసుక లారీలను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారంటూ బాధితుడు ప్రసాద్ ఆరోపించాడు.
పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. కొట్టారని… శిరోముండనం చేశారని ఆరోపించాడు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది. ఇటీవలే బాధితుడు రాష్ట్రపతికి కూడా లేఖ రాశాడు.. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం… వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు.. ఈ కేసులో ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ని కూడా సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా బాధితుడు ప్రసాద్ అదృశ్యమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.