విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వారికి వారం రోజులు సెలవులు.. కలెక్టర్ ఆర్డర్స్

కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల్లో ఇద్దరు మృతి చెందారు.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వారికి వారం రోజులు సెలవులు.. కలెక్టర్ ఆర్డర్స్

Representative image

Updated On : October 5, 2025 / 3:40 PM IST

Gurukul Students: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 611 మంది విద్యార్థులకు ఇటీవల జాండీస్ (పచ్చకామెర్లు) పరీక్షలు పూర్తయినప్పటికీ ఫలితాలు ఇంకా రాకపోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

జాండీస్ అంటే కాలేయం (లివర్) సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో బిలిరుబిన్ అనే పసుపు రంగు పదార్థం ఎక్కువై చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారే వ్యాధి. కలుషిత ఆహారం, నీరు వల్ల పచ్చకామెర్లు వచ్చే ముప్పు ఉంటుంది.  (Gurukul Students)

Also Read: మోటోరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్‌పై కెవ్వుకేక పెట్టించే ఆఫర్.. ఇప్పుడే కొనేశారనుకో..

దసరా సెలవులకు కొన్ని రోజుల క్రితం ఇళ్లకు వెళ్లిన కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల్లో ఇద్దరు మృతి చెందారు. చాలా మంది విద్యార్థినులు ఒకేసారి అనారోగ్యం బారిన పడడంతో కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తీసుకు రావాలని చెప్పారు. విద్యార్థినుల్లో 24 మంది పచ్చకామెర్లతో బాధపడుతున్నట్లు ఇప్పటికే తేలింది. మిగతావారి రిపోర్టులు రావాల్సి ఉంది.