Andhra Pradesh Three Capitals issue : ‘ప్రజల ఆకాంక్ష మేరకే రాజధాని ఉండాలి’ : ఏపీ మూడు రాజధానులపై రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ మూడు రాజధానుల విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు..బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానులు ఎక్కడ ఉండాలో పాలకులు నిర్ణయించకూడదంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

Andhra Pradesh three capitals issue
Andhra Pradesh three capitals issue : ఏపీ మూడు రాజధానుల విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు..బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఖరి వ్యక్తి వినిపించే గళానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని..బలవంతులపై బలహీనులకు అధికారం దక్కాలని అదే అసలైన స్వాతంత్ర్యానికి అర్థం అని అన్నారు. రాజధానులు ఎక్కడ ఉండాలో పాలకులు నిర్ణయించకూడదంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
గాంధీజీ చెప్పినట్లుగా బలవంతులకు కాదు బలహీనులకు కూడా అధికారం దక్కాలని అలా దక్కిననాడే అసలైన స్వాతంత్ర్యం అని..అదే రామ రాజ్య లక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు. విజయవాడలో ది హిందూత్వ నమూనా..చర్చాకార్యక్రమంలో పాల్గొన్న రాం మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో రాజధాని, నెల్లూరులో ఓ రాజధాని అంటూ పాలకులు రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించకూడదని..ప్రజల ఆకాంక్ష మేరకే రాజధాని ఉండాలని రాం మాధవ్ అన్నారు.
కాగా..ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రకటించటం..దానిపై తీవ్ర వ్యతిరేకత రావటంతో పున:పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులంతా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని అనే ప్రకటన ప్రభుత్వం చేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందని అని తేల్చి చెబుతున్నారు.
కానీ మూడు రాజధానుల విషయంలో ఘోరంగా విఫలమైన ఏపీ ప్రభుత్వం తేలు కుట్టిన దొంగలాగా మిన్నకుండిపోయింది. దీనిపై ముదుకు వెళ్లటంలేదు..అలాగని వెనక్కి తగ్గినట్లుగా చెప్పటంలేదు. రాజధాని విషయంలో శాసన సభకు సర్వాధికారాలున్నాయని..మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు నిర్ణయిస్తామంటూ అహంకారపు వ్యాఖ్యలు చేసారు వైసీప ప్రభుత్వ నేతలు. ఈ క్రమంలో రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
,