విశాఖే రాజధాని : చెన్నై, ముంబై నగరాలకు తుఫాన్ల ముప్పు లేదా

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 10:09 AM IST
విశాఖే రాజధాని : చెన్నై, ముంబై నగరాలకు తుఫాన్ల ముప్పు లేదా

Updated On : January 29, 2020 / 10:09 AM IST

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఆమోద ముద్ర కూడా వేసింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. కొత్త అంశం తెరపైకి వచ్చింది. విశాఖపట్నం నగరానికి తుఫాన్ ముప్పు పొంచి ఉందనే వార్తలు బయటకు వచ్చాయి. విశాఖకు తుఫాన్ల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని పలు మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. అయితే సీఎం జగన్ వాటిని ప్రజలకు తెలియకుండా మ్యానేజ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఈ వ్యవహారం దుమారం రేపడంతో.. మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అన్ని అంశాలపై చర్చించాకే రాజధాని వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకున్నామని బొత్స స్పష్టం చేశారు. ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు ఊహించుకుంటోందని ధ్వజమెత్తారు.

తమిళనాడు రాజధాని చెన్నై, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాలకు తుఫాన్ల ముప్పు లేదా? అని బొత్స ప్రశ్నించారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని వివరించారు. శాసన మండలి రద్దుకు, రాజధానికి సంబంధమే లేదన్నారు. ఆర్థిక భారం తప్ప.. మండలి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆ కారణంతోనే మండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.

మూడు రాజధానుల ప్రక్రియ ఆలస్యం కావొచ్చేమో కానీ.. ఏర్పాటు మాత్రం తథ్యమని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలు, ప్రాంతాల శ్రేయస్సు కోసమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ఎవరూ ఆటంకం కలిగించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

బొత్స కామెంట్స్:
* రాజధానిపై అన్నీ ఆలోచించే నిర్ణయం
* జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాం
* హైపవర్ కమిటీలో చర్చించాం
* రోజుకో రకంగా మాట్లాడటం చంద్రబాబుకి అలవాటే
* రాజధాని విషయంలో చంద్రబాబులా వ్యాపారులు సలహాలు తీసుకోలేదు

* శివరామకృష్ణన్ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు
* విశాఖలో లక్షా 75వేల మందికి ఇళ్లు కట్టిస్తాం
* చెన్నై, ముంబై నగరాలకు తుఫాన్ల ముప్పు లేదా
* అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ
* శాసనమండలి రద్దుకు, రాజధానికి సంబంధం లేదు

* చంద్రబాబు మాటల్లో నిలకడ లేదు
* రాజధాని వికేంద్రీకరణకు టీడీపీ అనుకూలమా? ప్రతికూలమా..?
* శాసన మండలి విషయంలో చంద్రబాబు మాటలు గమనించాలి
* ప్రభుత్వం అనేక కోణాల్లో ఆలోచించి.. కమిటీలు వేసింది
* విశాఖపై ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
* చంద్రబాబు విధానాల వల్లే ఏపీకి ఆర్థిక ఇబ్బందులు
* శివరామకృష్ణన్ కమిటీ సలహాలు చంద్రబాబు పట్టించుకోలేదు