Botsa Satyanarayana : కొత్త డ్రామా తెర మీదకి తెచ్చారు : బొత్స సత్యనారాయణ
చంద్రబాబు ఇప్పుడు కుటుంబసభ్యుల ప్రాపర్టీ కాదు జైలు ప్రాపర్టీగా ఉన్నాడని చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు, టక్కుటమార విద్యలను ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు.

Minister Botsa Satyanarayana
Botsa Satyanarayana – Chandrababu : చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తప్పు చేశారు కాబట్టి కోర్టు రిమాండ్ లో ఉంచిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదని కొత్త డ్రామా తెర మీదకి తెచ్చారని తెలిపారు. రిమాండ్ లో ఉన్నప్పుడు వారికి ఏ ఇబ్బంది కలిగినా కోర్టుకు విన్నవించుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే జైలు అధికారులు నడుచుకుంటారని తెలిపారు.
చంద్రబాబు ఇప్పుడు కుటుంబసభ్యుల ప్రాపర్టీ కాదు జైలు ప్రాపర్టీగా ఉన్నాడని చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు, టక్కుటమార విద్యలను ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి దానిని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదని పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఇన్ని రోజులు చంద్రబాబు జైలులో ఎందుకు ఉన్నాడని నిలదీశారు.
బెయిల్ కోసం ప్రయత్నించినట్లు కూడా అనిపించటం లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల వసతి కోసం జీవో ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుండే విశాఖలో ఉండాలని కోరుతున్నాని వెల్లడించారు.