TDP Leader B Tech Ravi : బ్రదర్ అనిల్‌ను కలవడంపై స్పందించిన బీటెక్ రవి.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
బ్రదర్ అనిల్ ఎయిర్ పోర్టులో కలిసిన ఘటనపై తాజాగా బీటెక్ రవి స్పందించారు. కడప ఎయిర్ పోర్టులో బ్రదర్ అనిల్ ను ...

TDP Leader B Tech Ravi
B Tech Ravi : ఏపీ రాజకీయాల్లో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌ను టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బ్రదర్ అనిల్ కుమార్ ఇండిగో విమానంలో బయలుదేరారు. ఆ సమయంలో కడప విమానాశ్రయంలోనే వీఐపీ లాంజ్‌లో బ్రదర్ అనిల్‌ను బీటెక్ రవి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీటెక్ రవి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో వీరిద్దరి కలయిక సంచలనంగా మారింది.
Also Read : CM Revanth Reddy : ముఖ్యమంత్రిగా నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే?
బ్రదర్ అనిల్ కుమార్ ను ఎయిర్ పోర్టులో కలిసిన ఘటనపై తాజాగా బీటెక్ రవి స్పందించారు. కడప ఎయిర్ పోర్టులో బ్రదర్ అనిల్ ను యాధృచ్చికంగా మాత్రమే కలిశానని అన్నారు. మేమంతా జగన్ బాధితులమే.. కలిస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా జగన్ బాధితులే. నిన్నటి వరకు షర్మిలపై విమర్శలు చేయని వైసీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరగానే తిట్టడం మొదలు పెట్టారని బీటెక్ రవి అన్నారు. వైసీపీకి ఇబ్బంది అనుకుంటే విజయమ్మపై కూడా విమర్శలు చేస్తారని అన్నారు. పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత తార స్థాయికి చేరింది. టీడీపీలో చేరిన వారిపై కేసులు పెడుతున్నారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని అన్నారు.
కడప ఎయిర్పోర్ట్ లో ఎదురు పడిన బ్రదర్ అనిల్ గారు మరియి మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి గారితో మర్యాద పూర్వకంగా పలకరించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడటం జరిగింది.. pic.twitter.com/jyw7g2uTbf
— B.Tech Ravi.Ex.MLC (@BTechRaviOff) January 3, 2024