గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి: బుద్దా వెంకన్న
ఆరా మస్తాన్ ఫేక్ సర్వేని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని అన్నారు. కూటమికి 130 సీట్లకు పైగా..

గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కూటమి అధికారంలోకి రాకుంటే తాను తన నాలుక కోసుకుంటానని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటారా అని ప్రశ్నించారు.
ఎన్నికలలో వైసీపీ ఓడితే. జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టనన చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని నిలదీశారు. ఆరా మస్తాన్ సర్వే భిన్నంగా ఉందని తెలిపారు. అది ఫేక్ సర్వే అని వైసీపీ ముఖ్య నాయకులకు తెలుసని చెప్పారు. బెట్టింగ్‌ల కోసమే మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు.
ఆరా మస్తాన్ ఫేక్ సర్వేని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని అన్నారు. కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయని తెలిపారు. ప్రజల్లో వేవ్ వచ్చిందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కోసం గతంలో ప్రజలు ఎదురు చూసే వాళ్లు కాదని తెలిపారు.
చంద్రబాబు మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని గతంలో ప్రకటించారని చెప్పారు. అన్న విధంగాగా సీఎంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అన్నారు. ఫేక్ సర్వేలతో వైసీపీ వారి అభిమానుల జీవితాలను నాశనం చేస్తోందని తెలిపారు.
అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి తక్కువ సీట్లు వస్తున్నట్లు ఇచ్చారు: సజ్జల