Andhrapradesh : కాకినాడలో కారు బీభత్సం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

Andhrapradesh : ఏపీలో కారు బీభత్సం సృష్టించింది. బస్సుకోసం వేచిఉన్న ప్రయాణికులపై దూసుకెళ్తింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..

Andhrapradesh : కాకినాడలో కారు బీభత్సం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

Car Accident

Updated On : November 8, 2025 / 9:17 AM IST

Andhrapradesh : ఏపీలో కారు బీభత్సం సృష్టించింది. అన్నవరం నుంచి జగ్గంపేట వస్తున్న కారు బస్సుకోసం బస్ షెల్టర్‌లో వేచిఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్తింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 7.30గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కారు ముందు టైరు ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో కారు అతివేగంలో అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రయాణికులతో పాటు రిక్షానుసైతం కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు గ్రామస్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటన స్థలికి చేరుకొని మృతులు, గాయపడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒక విద్యార్థికి రెండు కాళ్లకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది.

క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులకు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.