Road Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిన నలుగురు యువకులు

రెండు స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయయాయి. కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు.

Road Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిన నలుగురు యువకులు

Car Racing Road Accident

Vijayawada Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జగింది. విజయవాడ జాతీయ రహదారిపై కారు రేసింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. రమేష్ ఆసుపత్రికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్, ఫార్చునర్  కారుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు రేసింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఫార్చునర్ కారు ఢీ కొట్టింది. దీంతో స్కూటీలపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. రెండు స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయయాయి. కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు. విజయవాడ జాతీయ రహదారిపై కారు రేసింగ్ లు కలకలం రేపుతున్నాయి.

Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు కింద పడిన కారు, ఆరుగురి మృతి

బెంచ్, ఫార్చునర్ కార్లలో కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి రేసింగ్ చేసినట్లుగా సమాచారం. రమేష్ ఆస్పత్రి సమీపంలో కారు రేసింగ్ జరుగుతుండగా రోడ్డు ప్రమాదం జరుగడంతో ఈ కారు రేసింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను కారు రేసింగ్ లో పాల్గొన్న ఫార్చునర్ కారు బలంగా ఢీ కొట్టింది.

దీంతో స్కూటీపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడి పోయారు. వేగంగా వచ్చిన ఫార్చునర్ కారు బలంగా ఢీకొనడంతో స్కూటీ రెండు ముక్కలుగా విరిగిపోయింది. యువతీయువకులు భయంతో కారును అక్కడే వదిలేసి మరో కారులో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Kakinada Incident : ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మోటార్ సైకిల్, ముగ్గురు మృతి.. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

కార్ రేసింగ్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎప్పుటి నుండి కారు రేసింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. ఎవరు ఎవరు ఈ గ్రూపులలో ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే విజయవాడలో ఏఏ ప్రాంతాలలో రేసింగ్ లు నిర్వహిస్తున్నారని అడిగారు. కాగా, కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై బడాబాబులు ఒత్తిడి చేస్తున్నారు.