Kakinada Incident : ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మోటార్ సైకిల్, ముగ్గురు మృతి.. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Kakinada Incident : ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న నలుగురిలో ‌మగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తాళ్లరేవు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

Kakinada Incident : ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మోటార్ సైకిల్, ముగ్గురు మృతి.. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Kakinada Incident

కాకినాడ జిల్లాలో రహదారి రక్తసిక్తమైంది. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 216 జాతీయ రహదారిపై ఇటుకల లోడుతో ట్రాక్టర్ ఆగి ఉంది. ఆ ట్రాక్టర్ ను మోటారు సైకిల్ ఢీకొట్టింది.

ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న నలుగురిలో ‌మగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తాళ్లరేవు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

మోటార్ సైకిల్ పై ఇద్దరే ప్రయాణించాలి. అదీ హెల్మెట్ ధరించాలి. ఇది నిబంధన. అయితే, కొందరు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవడం లేదు. బేఖాతరు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్ పై నలుగురు ప్రయాణం చేస్తుండగా, ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది.

Also Read : షాకింగ్.. దీపావళికి బోనస్, సెలవు ఇవ్వలేదని ఓనర్‌ని హత్య చేసిన సిబ్బంది

చాలావరకు రోడ్డు ప్రమాదాలకు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణం అవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు వ్యవహరిస్తున్నారు. వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

రోడ్డు ప్రమాదాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. నిబంధనలను లైట్ తీసుకుంటున్నారు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోరు. రూల్స్ విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. ఇక, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరిత్యా నేరం అని తెలిసినా మారడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఘోర ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏ తప్పు చేయని అమాయకులు బలైపోతున్నారు.