Sureedu : వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడుపై కేసు నమోదు
తనపై కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ మాజీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్ తో పాటు గుంటూరు రేంజ్ డీఐజీ పాల రాజులపై చర్యలు తీసుకోవాలని సురేంద్ర నాథ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

case register against Sureedu
Case Registered Against Sureedu : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడుపై కేసు నమోదు నమోదు అయింది. సూరీడుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్ర నాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తప్పుడు ఫిర్యాదులతో తనపై కేసులు పెడుతున్నారంటూ సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్ర నాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
తనపై కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ మాజీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్ తో పాటు గుంటూరు రేంజ్ డీఐజీ పాల రాజులపై చర్యలు తీసుకోవాలని సురేంద్ర నాథ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సూరీడుతో పాటు మాజీ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ ఐ నరేష్, డీఐజీ పాల రాజుపై 380 382, 307, 120బీ. 167 తదితర సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
2014లో భర్త సురేంద్ర నాథ్ రెడ్డి వేధింపులపై సూరీడు కుమార్తె గంగా భవానీ గృహ హింస కేసు పెట్టారు. అప్పటి నుంచి సూరీడుతో సురేంద్ర నాథ రెడ్డి పలు మార్లు గొడవలు పడ్డారు. 2021 మార్చిలో సూరీడు ఇంటికి క్రికెట్ బాట్ తో వెళ్లి సురేంద్ర నాథ్ దాడి చేశారు. సూరీడు ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీసులు అప్పుడే హత్యా యత్నం కేసు నమోదు చేశారు.
తనను ఆ కేసులో అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని సురేంద్ర నాథ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇదే వ్యవహారంలో తనకు న్యాయం జరగడం లేదన్నారు. సురేంద్ర నాథ్ రెడ్డి 3వ అదనపు మెట్రోపాలిటటన్ కోర్టును ఆశ్రయించారు.