Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త.. 11,500 కోట్ల రూపాయలతో స్పెషల్ ప్యాకేజీ

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరారు.

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త.. 11,500 కోట్ల రూపాయలతో స్పెషల్ ప్యాకేజీ

Vizag Steel Plant

Updated On : January 16, 2025 / 9:49 PM IST

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. 11వేల 500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్వహణను కొనసాగించనున్నారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కోంటోంది. దీన్ని అధిగమించేందుకు స్పెషల్ ప్యాకేజీ అందించాలని నిర్ణయించుకుంది సెంట్రల్ క్యాబినెట్.

విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి..
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. అయితే, ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరారు.

Also Read : దమ్ముంటే రా.. లై డిటెక్టర్ టెస్ట్ పై సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం..
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే, నష్టాల్లో ఉన్న సంస్థను పరిరక్షించేందుకు, దాన్ని ముందుకు నడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సంస్థకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం భేటీ జరిగింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సాయంలో భాగంగా 11,500 కోట్ల ప్యాకేజీ..
విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించేందుకు కావాల్సిన ఆర్థిక సాయంలో భాగంగా 11,500 కోట్ల ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ కు కేటాయించబోతున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. రేపు దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. 2024 ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి ఇప్పటికే ప్రకటించారు. అప్పటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకున్న అన్ని మార్గాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

 

Also Read : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. ఈ దొంగ రూ. కోటి డిమాండ్ చేశాడట..!