చంద్రబాబు ఢిల్లీ టూర్ అందుకోసమేనా..? ఈ రిపోర్ట్ బ్రహ్మాస్త్రంగా మారిందా..?
ఈసారి చంద్రబాబు మూడ్రోజుల పాటు హస్తినలో ఉంటున్నారంటే రాజకీయంగా కూడా ఈటూర్‌పై ప్రాధాన్యం ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టు తిరుగుతున్నాయి. ప్రాజెక్ట్ వద్దని తెలంగాణ సర్కార్.. ఎవరికి నష్టముండదని ఏపీ ప్రభుత్వం.. ఇంతలో కేంద్రం సర్వేలు.. జీఆర్‌ఎంబీ అభ్యంతరాలు. ఇలా తెలుగు రాజకీయం రంజు మీదుంది. సరిగ్గా ఇదే టైమ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా మూడ్రోజులు హస్తినలోనే ఉంటారు. అసలే బనకచర్లకు కేంద్రం నో చెప్పిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇంతకీ ఏపీ సీఎం ఎవరెవరిని కలవబోతున్నారు.? బనకచర్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తారా.. ఇంతకీ చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎజెండా ఏంటి?
ఎన్నో రాజకీయ అంశాలు.. మరెన్నో ఇష్యూస్ ఉన్న వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈసారి ఏకంగా మూడ్రోజులు ఆయన హస్తినలో మకాం వేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఈ నెల 14న ఢిల్లీకి బయల్దేరి 16 తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సారి బాబు ఢిల్లీ పర్యటన వెనుక చాలా మ్యాటర్ ఉందని తెలుస్తోంది. అటు ప్రభుత్వ పరంగా.. ఇటు పొలిటికల్ అంశాల అజెండాగా చంద్రబాబు హస్తిన టూర్ కొనసాగే అవకాశముంది. అసలే 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.
Also Read: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకే శిక్షణ కావాలా..? ఏం జరుగుతోంది?
ఈ సారి సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెడతారని చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలంటే.. ఏపీకి సంబంధించి చాలా సీరియస్ వ్యవహారమే. ఎందుకంటే ఏపీలో 2029 ఎన్నికలు వరకు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్ట్‌లను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలని ఒక యాక్షన్‌తో ముందుకు వెళ్తున్నారు. జమిలి వస్తే ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలకు వెళ్లాలంటే.. పోలవరం, అమరావతి పనులన్నీ ఇంకా స్పీడప్ చేయాల్సి ఉంటుంది. అందుకు నిధులు చాలా అవసరం. ఆ నిధుల వేట కోసమే చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారని పార్టీ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది.
నీళ్లు, నిధులే కాదు.. రాజకీయంగా కూడా చాలా అంశాలు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎజెండాలో ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీని కలసి కీలక అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా బాబు అపాయింట్మెంట్ ఉంది. ఆయనతో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్‌పై డిస్కస్ చేస్తారని..అందులో రాజకీయ అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్‌తోనూ భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు.
అప్పును గ్రాంట్‌గా మార్చాలని రిక్వెస్ట్?
అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన 15వేల కోట్ల రూపాయల అప్పును గ్రాంట్‌గా మార్చాలని రిక్వెస్ట్ చేయనున్నారు సీఎం. ఆ నిధులను గ్రాంట్‌గా మారిస్తే.. మరిన్ని అప్పులు తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయి పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ మీద చర్చిస్తారని తెలుస్తోంది. ఇలా ఏపీకి సంబంధించి అనేక అంశాలను కేంద్రమంత్రుల దగ్గర ప్రస్తావించి ఏపీకి రావాల్సినవి, కావాల్సినవి రాబట్టే ప్రయత్నం చేయనున్నారు చంద్రబాబు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తన పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవనుండటంతో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై వాస్కోస్ నివేదిక ఇచ్చింది.
బనకచర్లకు వినియోగించేది వరద జలాలేనని వాస్కోస్ నివేదికలో రాసుకొచ్చింది. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్ ఆదేశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించింది వాస్కోస్. ఈ నివేదికను సీఎం చంద్రబాబు కేంద్రం దగ్గర ప్రస్తావిస్తారనే గాసిప్స్ రిసౌండ్ చేస్తున్నాయి. ఇప్పటికే నివేదికను చంద్రబాబు కూడా తెప్పించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నివేదిక ఏపీ ప్రభుత్వానికి బ్రహ్మాస్రంగా పనిచేస్తుందని లోకల్‌లో వినిపిస్తున్న టాక్. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై ప్రధాని, అమిత్‌షాతో కూడా చంద్రబాబు డిస్కస్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈసారి చంద్రబాబు మూడ్రోజుల పాటు హస్తినలో ఉంటున్నారంటే రాజకీయంగా కూడా ఈటూర్‌పై ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రబాబు మార్క్ వ్యూహాలు అమలులోకి వచ్చాక కానీ ఎవరికీ తెలియవు. అసలే ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఎంతో కీలకంగా ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో చంద్రబాబు అనుకున్నది సాధించుకుంటారని టాక్ కూడా వినిపిప్తోంది. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో అటు బనకచర్ల ఇటు అమరావతి అంశాలయితే టాప్ ప్రయారిటీస్ ఉండే అవకాశం ఉంది.