Kodali Nani : ఓడిపోతామని తెలిసే.. చంద్రబాబు అలా మాట్లాడుతున్నారు, టీడీపీకి వచ్చేది 22 సీట్లే- కొడాలి నాని

జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేశ్. సీఎం గురించి మాట్లాడటమా? Kodali Nani - Chandrababu Naidu

Kodali Nani : ఓడిపోతామని తెలిసే.. చంద్రబాబు అలా మాట్లాడుతున్నారు, టీడీపీకి వచ్చేది 22 సీట్లే- కొడాలి నాని

Kodali Nani - Chandrababu Naidu (Photo : Google)

Updated On : August 22, 2023 / 9:45 PM IST

Kodali Nani – Chandrababu Naidu : ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గన్నవరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభతో ఆ హీట్ మరింత పెరిగింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ టార్గెట్ గా టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆ ఇద్దరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక, కొడాలి నాని కూడా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయారు. నారా లోకేశ్, యార్లగడ్డ వెంకట్రావు సహా టీడీపీ నేతలపై ఎదురుదాడికి దిగారు.

”2024 ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు ముందే గ్రహించారు. అందుకే ఓట్ల తొలగింపును కారణంగా చూపించేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పాట.. ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా? అన్నట్లుంది యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం. గన్నవరంలో లోకేశ్ పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత ఎన్నికల్లో మా పార్టీ అధినేత జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేశ్. సీఎం గురించి మాట్లాడటమా? 64 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే 10 చోట్ల గెలిచిన టీడీపీ.. 175 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 22 చోట్ల తెలుస్తుందేమో?” అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Also Read..Chirala: ఆమంచి, కరణం గ్రూప్‌వార్‌.. వైసీపీ ట్రబుల్ షూటర్‌ ఎంట్రీతో పరిస్థితులు చక్కబడతాయా?

”మా పార్టీ అధినేత జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు. చంద్రబాబులా పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీపై ఆధారపడలేదు. అసలు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా? పక్కన తెలంగాణలో పోటీ చేస్తుందా? వెధవలు ఉన్న పార్టీ” అని ధ్వజమెత్తారు కొడాలి నాని.