Kottu Satyanarayana : చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం, లోకేశ్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది- మంత్రి కొట్టు సత్యనారాయణ

లోకేశ్ ను ఆంబోతులా రోడ్డు మీదకు వదిలేశారు. చంద్రబాబు హయాంలో వేల కోట్లు నామినేషన్ పద్దతిన ఇచ్చేశాడు. Kottu Satyanarayana - Chandrababu Naidu

Kottu Satyanarayana - Chandrababu Naidu (Photo : Google)

Kottu Satyanarayana – Chandrababu Naidu : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికార పక్షం మొత్తం చంద్రబాబుని టార్గెట్ చేసింది. ఛాన్స్ చిక్కితే చాలు చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు వస్తున్న వార్తల అంశాన్ని వైసీపీ నేతలు అస్త్రంగా మలుచుకున్నారు. చంద్రబాబుపై ముప్పేట దాడికి దిగారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

Also Read..Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడం ఖాయం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అంతేకాదు.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్ అని చంద్రబాబు, లోకేశ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.(Kottu Satyanarayana)

”చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది. అమరావతిని చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నాడు. ఐటీ నోటీసుల ద్వారా బయట పడింది ఆవగింజంత. చంద్రబాబు హయాంలో వేల కోట్లు నామినేషన్ పద్దతిన ఇచ్చేశాడు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో ఉన్న లింకులన్నీ బయటపడ్డాయి. లోకేశ్ ను ఆంబోతులా రోడ్డు మీదకు వదిలేశారు. లోకేశ్ పాదయాత్ర తర్వాత టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది. డబ్బులు నొక్కేసే విషయంలో మాత్రం చంద్రబాబు, లోకేశ్ లు పోటీ పడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ అవివేకి. సనాతన ధర్మం గురించి ఆయన చేసిన కామెంట్లు సబబు కాదు” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Also Read..Anil Kumar : దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్

చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. పలు మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయని ఐటీ శాఖ ఆరోపించినట్లు చెబుతున్నారు. ఐటీ శాఖ సెంట్రల్ సర్కిల్ లో కేసు నమోదైందని, 153సీ సెక్షన్ కింద నోటీసులు పంపినట్టు ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందన్నారు. కొన్ని బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఈ లెక్కాపత్రం లేని నగదు చంద్రబాబుకు ముట్టినట్టు ఐటీ శాఖ చెబుతోందని, ఇది అప్రకటిత ఆదాయంగా ఐటీ శాఖ అభివర్ణించిందని వైసీపీ నాయకులు అంటున్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఐటీ నోటీసులు రాకుండా చంద్రబాబు అడ్డుపడాలని చూశారని, కానీ కుదర్లేదని చెప్పారు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం చంద్రబాబు నైజం అని విమర్శలు గుప్పించారు.