Kottu Satyanarayana : రేపో మాపో జైలుకెళ్లడం ఖాయం, ఆ తర్వాత పార్టీ భవిష్యత్తు ఏంటో- మంత్రి కొట్టు సత్యనారాయణ
మట్టి మాఫియా, భూకబ్జా, సెటిల్ మెంట్ దందాలు, రౌడీయిజం.. ఇదీ మీ నాయకుల చరిత్ర.. ప్రజలు అధికారం ఇవ్వగానే మనీ లాండరింగ్ కు పాల్పడే గజదొంగ నువ్వు.(Kottu Satyanarayana)

Kottu Satyanarayana (Photo : Google)
Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ, మరోసారి అధికారం నిలుపుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. తీవ్ర విమర్శలు, ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ నాయకులు మరో అడుగు ముందుకేసి.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం అని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ భవిష్యత్తు ఏంటో అని వాపోతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు, టీడీపీ బస్సు యాత్ర, పవన్ కల్యాణ్ పై ఆయన విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ కాదు, అది టీడీపీ దొంగల ముఠా బస్సు యాత్ర అని మంత్రి కొట్టు అన్నారు.
ప్రజల భవిష్యత్తుకు జగనన్న గ్యారెంటీ అని చెప్పారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ముందు చూసుకోండి అని సూచించారు. బస్సులో టీడీపీ దొంగల ముఠా వస్తోందన్న మంత్రి కొట్టు.. అందులో ఒక్కొక్కరికి ఒక్కో ఘన చరిత్ర ఉందన్నారు. టీడీపీ బస్సు యాత్రలో ప్రయాణించే ఒక్కొక్క నాయకుడికి ఘనమైన నేర చరిత్ర ఉందని ధ్వజమెత్తారు.
”మట్టి మాఫియా, భూకబ్జా, సెటిల్ మెంట్ దందాలు, రౌడీయిజం.. ఇదీ మీ నాయకుల చరిత్ర.. ప్రజలు అధికారం ఇవ్వగానే మనీ లాండరింగ్ కు పాల్పడే గజదొంగ నువ్వు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో చెట్టపట్టాలేసుకుని తిరిగిన నువ్వు కూడా రేపోమాపో జైలుకెళ్లడం ఖాయం. ప్రజల భవిష్యత్తుకు నువ్వు గ్యారెంటీ ఇవ్వడం కాదు, నీ భవిష్యత్తు గ్యారెంటీ ఏంటో ముందు చూసుకో” అని చంద్రబాబుకి సూచించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Also Read..Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్