Chandrababu Tour: 17 నుంచి ఆ మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గోనున్న టీడీపీ అధినేత

ఈ నెల 17 నుంచి 19 వరకు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Chandrababu Tour: 17 నుంచి ఆ మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గోనున్న టీడీపీ అధినేత

Chandrababu Naidu

Updated On : May 16, 2023 / 1:33 PM IST

 

Chandrababu Naidu: ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని, రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా ఈ నెల 17 నుంచి 19 వరకు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Chandrababu Naidu : ఇక మెత్తగా ఉండను, అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

మూడు రోజుల పాటు విశాఖ పట్టణం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. 17న పెందుర్తి, 18న ఎస్.కోట, 19న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబు పర్యటనలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

Tirupati Fires : తిరుపతి జిల్లా కొత్తశానంబట్లలో 20 రోజులుగా చెలరేగుతున్న మంటలు.. అకారణంగా తగలబడుతున్న ఇళ్లల్లోని వస్తువులు

17న విశాఖ పట్టణం జిల్లాలోని పెందుర్తిలో జరిగే రోడ్ షో, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా 18వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు ఎస్ కోటలో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. 19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అనకాలపల్లి సమీపంలోని శంకరం జంక్షన్‌ నుండి రోడ్ షో నిర్వహిస్తారు. నాలుగు రోడ్ల కూడలి మీదుగా నెహ్రూ చౌక్ కు చేరుకొని బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అదే రాత్రి తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్తారు.