34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల

టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 

34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల

TDP 2nd List

టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలిజాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.

రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రాంనారాయణ రెడ్డి, దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ పోటీ చేయాల్సిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది.

టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో పీహెచ్‌డీ చేసిన వారు ఒక్కరు, పీజీ చేసిన వారు 11మంది, గ్రాడ్యుయేట్లు తొమ్మిది మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు ఎనిమిది మంది, 10వ తరగతి చదివిన వాళ్లు ఐదుగురు ఉన్నారు.

రెండు జాబితాలోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లు లేవు. గురజాల టికెట్ యరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు.  శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల నేతలు ఇంకా సస్పెన్స్ లోనే  ఉన్నారు. ఆశావహ అభ్యర్థుల పోటీ ఎక్కువుగా ఉన్న ఐదు నియోజకవర్గాలను హోల్డ్ లోనే ఉంచింది టీడీపీ.

34 మంది అభ్యర్థులు వీరే..

 Also Read: టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్