ఏపీలో మొబైల్ యాప్‌తో ఎన్నికల్లో అక్రమాలకు చెక్

అవును ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటాన్నయనే విషయాన్ని యాప్ ద్వారా ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేయవచ్చు. అవినీతి, అక్రమాలు లేకుండా చేయాలని సీఎం జగన్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానమైంది…ఎన్నికలు..కానీ..డబ్బు, మద్యం ప్రలోభ పెట్టి..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని పార్టీలు.
ఏపీలో జడ్పీ, స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ఉంది. ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు…‘నిఘా’ పేరిట పంచాయతీ రాజ్ శాఖ ఓ యాప్‌ను ముందుకు తీసుకొచ్చింది. 2020, మార్చి 07వ తేదీ శనివారం ఈ యాప్‌ను ఆవిష్కరించనున్నారు.
ఎన్నికల నియామవళిని అతిక్రమించి..అభ్యర్థుల ఓటర్లను బెదిరింపులు..ప్రలోభాలకు గురిచేసినట్లయితే..వారు గెలుపొందినా..పదవుల్లో కొనసాగడానికి వారిని అనర్హులుగా ప్రకటించడంతో ఆరేళ్ల పాటు..తిరిగి పోటీత చేయకుండా ఉండేలా ఏపీ ప్రభుత్వం ఇటీవలే చట్టం తీసుకొచ్చింది.
వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానాను విధించనున్నారు. ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి ఎన్నికలతో పాటు..మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మొబైల్ యాప్‌ను ముందుకు తీసుకొచ్చారు.
యాప్ వల్ల ఉపయోగాలేంటీ ..
* యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలి. మొదట తమ ఫోన్ నెంబర్‌ని రిజిస్టర్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మొబైల్ నెంబర్‌కు OTP నెంబబర్ వస్తుంది.
* ఈ OTPని ఎంటర్ చేయాలి. దీంతో యాప్ డౌన్‌లోడ్ అయి..యాప్ ఓపెన్ అవుతుంది.
* తమ కళ్ల ముందు..జరిగిన అక్రమాలకు సంబంధించిన..ఫొటో, వీడియోలను యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
* కంప్లయింట్ చేసే వారు తమ వ్యక్తిగత సమాచారం ఇష్టం ఉంటేనే తెలియచేసే అవకాశం ఉంది.
* ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
* ఫిర్యాదు దారులు పంపించిన ఫిర్యాదును GPS ద్వారా గుర్తించి అధికారులు చర్యలు తీసుకుంటారు.
* ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసే వారు ఆ సమాచారం సరిగ్గా ఉందో లేదోనని మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది.
Read More : ఇద్దరి ప్రాణాలు తీసిన లాఫీంగ్ గ్యాస్ !
See More:
* ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : మద్యం, డబ్బు పంపిణీ చేస్తే..మూడేళ్ల జైలు శిక్ష
* కరోనా ఉంది..స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయ్యండి – టీడీపీ