Chintamani Show: చింతామణి నాటకంపై హైకోర్టులో విచారణ

తెలుగు పౌరాణిక కళల్లో ఒకటైన నాటకాల్లో చింతామణి నాటకం ఫ్యామస్. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. పలువురు పిటిషన్ దాఖలు చేశారు. నాటకాన్ని నిషేదించాలని అందులో పేర్కొన్నారు.

Chintamani Show: చింతామణి నాటకంపై హైకోర్టులో విచారణ

Chintamani

Updated On : June 24, 2022 / 11:36 AM IST

Chintamani Show: తెలుగు పౌరాణిక కళల్లో ఒకటైన నాటకాల్లో చింతామణి నాటకం ఫ్యామస్. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. పలువురు పిటిషన్ దాఖలు చేశారు. నాటకాన్ని నిషేదించాలని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, నాటకాన్ని నిషేదిస్తే.. కళాకారులకు ఉపాధి లేకుండాపోతుందని వాదించనున్నారు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్.

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా చింతామణి నాటకం నిషేధం పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జీవనోపాధి కోల్పోయామని కళాకారుల తరపున అరకు త్రినాథ్ అనే కళాకారుడు పిటిషన్ ఫైల్ చేశారు. రెండు పిటిషన్స్ కలిపి విచారణకు ఆదేశించింది హైకోర్ట్ ధర్మాసనం.

Read Also: చింతామణి నాటకంపై హైకోర్టు కీలక ఆదేశాలు